Kishan Reddy : గిరిజన సంక్షేమానికి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమానికి మోడీ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యిందన్నారు కిషన్ రెడ్డి. గత సంవత్సరం లక్ష పదిహేడు కోట్లకు పైగా గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ప్రధాని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్య్రమo చేపడుతున్నామన్నారు కిషన్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎండ్లు గడుస్తున్న ఆదివాసీల బ్రతుకులు మారలేదన్నారు కిషన్ రెడ్డి. 75 తెగల ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, రేపటి నుంచి ప్రధాని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. గిరిజనుల అభివృద్ధికి పదకొండు అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, 18 రాష్ట్రాలలో 75 తెగల ఆదివాసీలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, 82 వేల గూడెలు, 32 లక్షల ఆదివాసీలు దేశంలో ఉన్నారన్నారు కిషన్ రెడ్డి.
Also Read
- Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
ఆదివాసిల అభివృద్ధిపై మోడీ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని, 75 సంవత్సరాలుగా చేయలేని పని 45 రోజులలో మోడీ చేసి చూపించారన్నారు. అర్హులైన ఆదివాసీలకు సొంత ఇండ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని, వంద ఆదివాసిల హాస్టల్స్ నిర్మించబోతున్నామన్నారు కిషన్ రెడ్డి. ఆదివాసీల హాస్పిటల్స్ కట్టబోతున్నామని, ఆదివాసీల 17 గ్రామాల్లో రేపు కరెంట్ వెలగబోతోందన్నారు కిషన్ రెడ్డి. 72 వేల ఆధార్ కార్డులు, 83 వేల ఆయూస్మాన్ భవ హెల్త్ కార్డులు అందిస్తున్నామని, రేపు ఆదివాసీలకు 49 వెలకు పైగా క్యాస్ట్ సరిఫికెట్స్, 32 వెళ్ళు పైగా రేషన్ కార్డులు అందించబోతున్నామన్నారు. ఆదివాసీలు సంపూర్ణమైన సాధికారిత సాధించే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఆదివాసీలు కనీసం మౌలిక వసతులు లేవన్నారు.
3 లక్షల ఆదివాసీల విద్యార్థులకు ఏక లవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ ఏర్పాటు ఉంటుందని, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణకు కేటాయించందని ఆయన వెల్లడించారు. యూనివర్సిటీ ఏర్పాటు అయితే గిరిజన విద్యార్థుల బతుకులు మారుతాయని, యూనివర్సిటీ నిర్మానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలిక యునివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, తెలంగాణలో ఆదివాసీలు ఎక్కువగా వెనక బడిన ప్రాంతాలు, బూపాలపల్లి, హసిఫాబాధ్, భద్రాచలం ప్రాoతాలుగా గుర్తించామని ఆయన తెలిపారు. ట్రైబల్ టూరిజం అభివృద్ధి చేయడంపై కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రేపు వర్చువల్ గా 18 రాష్ట్రాల గిరిజనులతో ప్రధాని మాట్లాడుతారన్నారు.
తాజావార్తలు
-
Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
-
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!