Site icon NTV Telugu

Kishan Reddy: మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషల ప్రోత్సాహానికి కృతనిశ్చయంగా పనిచేస్తోంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా.. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని, భారత్ భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యంతో గొప్పదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని, మన దేశంలో 121 భాషలు ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం భాషలలో గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలు ఉండేవి. కానీ, మోదీ ప్రభుత్వం వచ్చాక 21 భాషలకు అధికారిక స్థానం దక్కిందని కిషన్ రెడ్డి చెప్పారు.

Also Read: Daikin: ఏపీలో ‘డైకిన్‌’ భారీ పెట్టుబడులు.. శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్‌!

భాషలు మన సంస్కృతి, వారసత్వం, జ్ఞాన సంపదకు నిలయాలు అని కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్ పేయి నేతృత్వంలో ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇచ్చిందని, భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్ పేయి చెప్పారని ఆయన పేర్కొన్నారు. భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం 1835లో మెకాలే ద్వారా జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. 1956లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు, భాష ఒక కీలక అంశంగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read: Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు

పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. అయితే, ప్రజలు ఈ ఫార్ములా వినియోగంలో సంతృప్తిగా లేని కారణంగా, మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. 2020లో మోడీ NEP-2020 నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు కనీసం రెండు ప్రాంతీయ భాషలను నేర్చుకునేలా ప్రోత్సాహం ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. భాషల ప్రాముఖ్యతను తీసుకుని, మోడీ ప్రభుత్వం దేశంలో ప్రాంతీయ భాషలను మరింత ప్రోత్సహించడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.

Exit mobile version