Site icon NTV Telugu

Kishan Reddy: రెండు కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలి

Kishan Reddy

Kishan Reddy

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ భాగస్వామ్యం కాబోతుందని కేటీఆర్ అన్నారని.. కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రెండు పార్టీల మధ్య మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తోందని తెలిపారు.

Viral Video: రోడ్డుపై తాచుపాము, ముంగిస హల్‌చల్.. వీడియో ఇదిగో..

అంతేకాకుండా.. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార అభ్యర్థి ఎన్నికల బాధ్యత కేసీఆర్ తీసుకున్నారని..
రెండు పార్టీల డీఎన్ఏ ఒకటిగా ఉందో, రెండు రోజుల ప్రకటనతో తేటతెల్లమైందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలని స్పష్టమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.., మజ్లిస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పారని.. పచ్చి మతవాద పార్టీ అయిన మజ్లిస్ ఏ రకంగా సెక్యులర్ పార్టీనో చెప్పాలని కిషన్ రెడ్డి తెలిపారు.

Tooth Pain: పంటి నొప్పి ఇబ్బంది పెడుతుందా?.. ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..

మూడు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేసినా, బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని తెలిపారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేసినా మజ్లిస్ పార్టీకి జై కొట్టినట్లేనని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలను తెలంగాణ సమాజం అర్ధం చేసుకుని, బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీల మాటలకు ప్రజలు మోసపోరాదని విజ్ఞప్తి చేశారు. రెండు కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. సీఎంకు 40కి పైగా ఉత్తరాలు రాశానని.. ఏ ఒక్క ఉత్తరానికి సమాధానం ఇవ్వని కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Exit mobile version