NTV Telugu Site icon

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి విధానాలు ఒక్కటే

Kishanreddy

Kishanreddy

పోలీసులది దౌర్జన్య దమనకాండ కాంగ్రెస్ దురహంకారానికి నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హిందూ నిరసనకారులపై లాఠీచార్జీ సహించరానిదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి విధానాలు ఒక్కటే అని కిషన్‌ రెడ్డి అన్నారు. అన్యమతస్థుల ప్రార్థనాలయాల్లో శబ్దాలు పోలీసులకు, సీఎంకు వినిపించవా? గుడిపక్కనే అంతమంది క్లాసుల పేరిట ఉంటే పోలీసులేంచేస్తున్నారు? వీకీపీడీయా, గూగూల్ ద్వారా సమాధానాలు రాయాలా? నిరుద్యోగులు, విద్యార్థులతో మాట్లాడరెందుకు? పరీక్షల్లో ఒకే విధానం ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు కిషన్‌ రెడ్డి. నిరుద్యోగ యువకులు గత వారం రోజులుగా అశోక్ నగర్ లో నిరసన కార్యక్రమాలు చేపడితే సీఎం మాటలు చేతలు దాటుతున్నాయే తప్ప సచివాలయం గేటు దాటటడం లేదని, నిరుద్యోగ, రైతాంగ, పేదలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, ఎన్నికలలో హామీలు ఏ ఒక్కటి సచివాలయం గేటు దాటడం లేదన్నారు కిషన్‌ రెడ్డి. దేవాలయంలో రక్తాభిషేకం చేస్తారా? నిరసనాకారులు టెర్రరిస్టులా? అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని, వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేకమందిపై కేసులు పెట్టించారన్నారు. అన్యమతస్థులకు సంబంధించిన ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Kadapa: బద్వేల్ ఇంటర్ విద్యార్థిని ఘటన కేసులో సంచలన విషయాలు..

అంతేకాకుండా..’ఇతర రాష్ర్టల నుంచి వచ్చిన వారు అక్కడ మతపరమైన శిక్షణ పొంది హిందూ దేవాలయంపై ఒక వ్యక్తి దాడి చేస్తే ఎందుకు సీఎం, కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, అమ్మవారిని కొలిస్తే, హిందూ దేవుళ్ల పండుగలు దేవున్ని కొలిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు బాధ వేస్తుంది. ముత్యాలమ్మ నిరసనకారులపై ఎందుకంత పాశవికంగా దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒక కార్యకర్తకు 9 కుట్లు పడ్డాయి. దేవాలయ ధ్వంసం వంటి వీడియోలు చూసిన ఏ హిందువుకైనా ఆగ్రహం రాకుండా, ఆక్రోశం రాకుండాఉంటుందా? అసలు మోటివేషన్ క్లాసుల పేరుతో అంతమంది గుడిపక్కనే హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుంది అశోక్ నగర్ లైబ్రరీలో సీఎం కాకముందు కబుర్లు చెప్పారన్నారు. ఇప్పుడేమో ఏకంగా లాఠీచార్జీకి దిగుతారా? వారంతా మన పిల్లలే అని వారితో ఒకసారి చర్చిస్తే పోయేదేముందని వారి బాధను కూడా అర్థం చేసుకోవాలి. సీఎం తీరు చూస్తే బీఆర్ఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తుందన్నట్లు స్పష్టం అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏ విధమైన మార్పు లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సేమ్ టు సేమ్ వీరి విధానాలతో నిరుద్యోగ యువత ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధైర్యం లేకుంటే పోలీసులు వెంట బెట్టుకెళ్లండి.. వీకీపీడియా, గూగూల్ ను ఆధారంగా తీసుకొని పరీక్షలు రాయమంటారా? తెలుగు అకాడమీ పుస్తకాల జవాబులు చెల్లవంటే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో 29 విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందులో దాపురికం లేకపోతే ఎందుకు పిలిచి మాట్లాడరు’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..

Show comments