Site icon NTV Telugu

Kishan Reddy : సింహం పోతుంటే నక్కలు మోరిగినట్టు కొందరు మోడీపై మాట్లాడుతున్నారు

Kishan Reddy

Kishan Reddy

మోడీ సభను అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెచ్చరిస్తున్నా ఎలాంటి సంఘటన జరిగిన సీఎం బాధ్యత వహించాలి, కల్వకుంట్ల కుటుంబం వహించాలి అని ఆయన అన్నారు. మేము భయపడే ప్రసక్తే లేదని, సింగరేణిని ప్రైవేట్ పరం చేసే అవకాశం కేంద్రానికి లేదు… రాష్ట్రానికి ఉందని ఆయన పేర్కొన్నారు. కొద్ది సమయమైనా తెలంగాణ ప్రజల అభివృద్ధి కి కేటాయించాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ వస్తారని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారని ఆయన తెలిపారు.

Also Read : PM Modi: రేపు చెన్నైకి ప్రధాని మోదీ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, వందేభారత్‌ రైలు ప్రారంభం

అడవిలో సింహం పోతుంటే నక్కలు మోరిగినట్టు కొందరు మోడీ పై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం మెప్పు కోసం మోడీ వస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబం మెప్పు కోసం రావడం లేదని, వాళ్ళ సర్టిఫికెట్ మాకు అవసరం లేదన్నారు. ఈ దోపిడీ, అహంకార పాలన పోవాలి అనేది మా లక్ష్యమని, వాక్సిన్ కొరత లేదు… అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. తెలంగాణ అభివృద్ధి కోరుకునే ప్రతి బిడ్డ మోడీ కార్యక్రమానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read : Delhi Capitals: ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్ జంప్.. ఎందుకో తెలుసా?

Exit mobile version