Kishan Reddy: తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే నిజమైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేశారు.
Read Also: JP Nadda: తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం
అధికారంలోకి వస్తే ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని.. ఈ రెండు పార్టీలది ఒక్కటే డీఎన్ఏ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు అంటూ ఆయన అన్నారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం రాబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోటా పోటీగా ఎనిమిది ఎంపీ సీట్లు సాధించామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్‌ను గద్దె దించుతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.