మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. మోడీ విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. 2047 నాటికి పేదరికం లేని దేశంగా… అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందామని, మెజార్టీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గెలినేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు… ఓటు వృధా అవుతుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీ అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతోందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఉగ్రవాదం పెరిగింది… ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైందని, అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరాలని కోరుతున్నారన్నారు. దేశం కోసం మోడీ కి ఓటు వేయండని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెలంగాణ లో రాజకీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కిషన్ రెడ్డి అన్నారు. హిందువుల కోసం భారత దేశం తప్ప మరో దేశం లేదని, హిందుత్వ అంటే జీవన విధానమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉగ్రవాదం పెరిగిందని, ప్రపంచ దేశాల ముందు భారత్ నవ్వుల పాలైందని ఆయన గుర్తుచేశారు. 2047 నాటికి పేదరికం లేని దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందామని, దీనికి ప్రజల మద్దతు కావాలని ఆయన కోరారు. అలాగే పార్టీలో భారీగా చేరికలు జరగాలన్నారు.