అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనా కమ్యునిస్టు పార్టీని వెనక్కి నెట్టేసి బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. బంగారు తెలగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. దేశంలో తెలంగాణను నవ్వుల పాలు చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. దేశంలో కుటుంబ పార్టీ లకు నాయకత్వం వహిస్తానని, ఖర్చు పెట్టుకుంటా అని కేసీఆర్ చెప్పడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 9 ఏళ్ళల్లో ఒక్క రోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదని, కేసీఆర్ సచివాలయానికి రారు.. పాలనను విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. కుట్రలు చేసి.. బీజేపీని అనిచివేయలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. TSPSC పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, ఆ విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని ఆయన దుయ్యబట్టారు. TSPSC లీకేజీ నీ ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read : Ajith Antony : బీజేపీలో అనిల్ కరివేపాకు.. పార్టీ నుంచి గెంటేస్తారు..
తెలంగాణలో ప్రాజెక్ట్ ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోడీ వస్తున్నారని, హైదరాబాద్ లో కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా MMTS పెడింగ్ పడిందన్నారు. వందే భారత్ రైలును హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు రేపు ప్రధాని ప్రారంభించనున్నారని, సికిద్రాబాదు రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు మోడీ శంకుస్థపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకాల్సిన రాష్ట్ర ప్రభుత్వo నిరసనలకు దిగుతుందని, రీజినల్ రింగ్ రోడ్డు ను కేంద్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. RRR కోసం భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిధులు ఇవ్వడం లేదని, కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం బీజేపీని ఆశీర్వదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Manish Sisodia: ప్రధాని మోడీకి తక్కువ అర్హతలు.. దేశానికి ప్రమాదకరం