NTV Telugu Site icon

JNTUH: జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్సలర్‌గా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ..

Jntuh Vice Chancellor

Jntuh Vice Chancellor

తెలంగాణ ప్రభుత్వం జేఎన్‌టీయూహెచ్ (JNTUH) హైదరాబాద్ యూనివర్సిటీకి వీసీని నియమించింది. వైస్ చాన్సలర్‌గా టి. కిష‌న్ కుమార్ రెడ్డిని నియమించింది. వీసీ నియామకానికి సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర గ‌వ‌ర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌టీయూ వీసీగా కిష‌న్ కుమార్ రెడ్డి.. ప‌ద‌వీ బాధ్యతలు స్వీక‌రించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also: Maha Kumbh 2025: వామ్మో.. కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది స్నానాలు చేశారా? యూపీ సర్కార్‌ ప్రకటన

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు పాటుపడతాను. విద్యార్థుల అకడమిక్, పరిశోధనా ప్రగతికి అనువైన వాతావరణం అందించేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు. ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్‌లో విశేష అనుభవం కలిగిన శాస్త్రవేత్త. ఆయన జేఎన్‌టీయూహెచ్‌లో డైరెక్టర్‌గా (1994-2016), పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్శిటీ (PDPU) వైస్ చాన్సలర్‌గా (2016-2018) సేవలందించారు. అలాగే AICTE, DRDL, DMRL, NASA వంటి సంస్థలతో పరిశోధనలలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2010), IAAM మెడల్ (2018) వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.

Read Also: The Devil’s Chair: సంతోషపడాలా? బాధపడాలా? అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు