కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ అంతా పూర్తి కాగా.. సరైన రిలీజ్ డేట్ కోసం చుస్తున్నారు. అయితే బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం మొదటి వీడియో సాంగ్ ఈరోజు లాంచ్ అయింది.
జిగ్రీస్ సినిమా మొదటి పాట ‘తిరిగే భూమి’ని టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ అనంతరం హీరో మాట్లాడుతూ… ‘ఈ సాంగ్ చాలా ఎనర్జీటిక్‌గా ఉంది. కమ్రాన్ సయ్యద్ ఇచ్చిన ట్యూన్ చాలా ఫ్రెష్‌గా ఉంది. లిరిక్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. టీజర్ నేను ముందే చూశా, బాగా నచ్చింది. ఇప్పుడు నేను K Ramp సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా సాంగ్ రిలీజ్ కోసం ఇక్కడికి రావడానికి ఓ కారణం ఉంది. షూటింగ్ స్పాట్‌కి పిలిపించి మరీ ఈ సినిమా గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే. అందుకే కొత్త వాళ్లంటే నాకు ఇష్టం. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్‌తో సినిమా చేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జిగ్రీస్ టీమ్ సబ్యులకు నా తరఫున ప్రత్యేక విషెస్’ అని అన్నారు.
Also Read: Rushikonda Resorts: రుషికొండ రిసార్ట్‌ల అంశంపై కేబినెట్ సబ్ కమిటీ!
‘తిరిగే భూమి’ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే 20 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటను ‘T-Series’లో విడుదల చేశారు. టీజర్‌తో వచ్చిన బజ్‌కి తోడు ఈ పాట కూడా సినిమాకు మంచి క్రేజ్ తెచ్చిపెడుతోంది. జిగ్రీస్ సినిమా టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. 3 రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ రాబట్టింది. మొన్న సందీప్ రెడ్డి వంగా, ఈరోజు కిరణ్ అబ్బవరం ప్రమోట్ చేయడంతో జిగ్రీస్ సినిమా జనాల్లో నానుతోంది.