NTV Telugu Site icon

Kimidi Nagarjuna: టీడీపీకీ బిగ్ షాక్.. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున రాజీనామా

Kimidi Nagarjuna

Kimidi Nagarjuna

Kimidi Nagarjuna: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ ఇంచార్జి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి కిమిడి నాగార్జున టికెట్ ఆశించారు. ఈ క్రమంలోనే టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్‌.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు

చీపురుపల్లి సీటును కిమిడి కళా వెంకట్రావుకు అధిష్టానం కేటాయించింది. దీంతోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. గత ఐదేళ్లుగా చీపురుపల్లి ఇంఛార్జిగా కిమిడి నాగార్జున ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేశారు. 2019లో చీపురుపల్లి నుంచి బొత్సపై పోటీ చేసి నాగార్జున ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వచ్చారు. కిమిడి నాగార్జునకు సీటు రాకపోవడంతో కార్యకర్తలు , ఆయన అభిమానులు చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఉన్న బ్యానర్లను పీకి బయటపడేశారు. టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టారు.
తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కిమిడి నాగార్జున.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. నాగార్జున తల్లి మృణాలిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.