Celebrity Divorce: సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. ఒక్కొక్కరు రెండు పెళ్లిళ్లు.. మూడు మ్యారేజ్‌లు.. నాల్గో వివాహం అనే విధంగా కూడా ఉంది.. కొందరు సెలబ్రిటీల పరిస్థితి.. ఇక, అమెరికా లాంటి దేశాల్లో అయితే.. వీటి గురించి చెప్పక్కరలేదు.. తాజాగా, తన భర్త కాన్యే వెస్ట్‌కు విడాకులు ఇవ్వడంపై షాకింగ్ రీజన్ చెప్పారు అమెరికన్ సెలబ్రిటీ కిమ్ కర్ధాషియన్..
Read Also: Food Safety Officers Rides: హోటళ్లలో లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..!
ఓవైపు, అతడు మంచి భర్త అని కాన్యే వెస్ట్‌పై ప్రశంసలు కురిపించిన ఆమె.. కానీ, తాను మంచి మూడ్‌లో ఉంటే అతను మాత్రం నిద్రపోతాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.. “కాన్యే వెస్ట్ నాకు సరైన భర్త, కానీ, అతను ఎక్కడైనా, ఎప్పుడైనా నిద్రపోతాడు.. కాబట్టి నేను అతనికి విడాకులు ఇచ్చాను. మేం ఔటింగ్‌కి వెళ్లినప్పుడు కూడా అతను నిద్రపోయేవాడు.. కాన్యే వెస్ట్ ఎక్కడైనా, ఎప్పుడైనా నిద్రపోతాడు.. మేం ఒక మీటింగ్‌లో ఉంటాం.. అప్పుడు అతను నన్ను కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాడు.. మేం మాట్లాడుతుండగానే కాన్నే నిద్రపోతాడు. లేదా మనం ఒక రెస్టారెంట్‌లో ఉంటాం.. అప్పుడూ కూడా జనరేటర్ లాగా పెద్ద సౌండ్‌తో గురకలు కొడుతూ నిద్రపోతాడు.. కొన్నిసార్లు మంచి మూడ్‌తో ఔటింగ్‌కి వెళ్లినప్పుడు కూడా అతను నిద్రపోతాడు. కాన్యే వెస్ట్.. అనారోగ్యంతో నిద్రపోవడం చాలా బాధించేది.. అందుకే నేను అతనికి విడాకులు ఇచ్చాను”అంటూ వాళ్ల విడాకుల వెనుక ఉన్న అసలు కారణాన్ని చెప్పుకొచ్చారు కిమ్ కర్దాషియాన్..