ఈ మధ్య పాత సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఆడియన్స్ నుంచి మరోసారి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. మొన్న ఈ మధ్య ఓయ్ సినిమా రిలీజ్ అయింది.. ఇప్పుడు రవితేజ హిట్ మూవీస్ కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి.. కిక్, దుబాయ్ శీను త్వరలోనే మళ్లీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా కిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ వదిలారు..
ఈ సినిమా మార్చి 1, 2024న విడుదలకి షెడ్యూల్ చేయబడింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP నైజాంలో ఈ సినిమా ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు కిక్ 4K ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది..
ఇకపోతే ఈ సినిమాలో మాస్ మహారాజ రవి తేజ సరసన ఇలియానా డి క్రజ్ జోడిగా నటించారు. ఈ సినిమాలో షామ్, కోట శ్రీనివాసరావు, అలీ, సాయాజీ షిండే మరియు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. థమన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ప్రేక్షకులలో చార్ట్-టాపింగ్ ఫేవరెట్‌గా మిగిలిపోయింది.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. RR మూవీ మేకర్స్ పై RR వెంకట్ నిర్మాతగా వ్యవహారించారు.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..