బాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ యాక్ట్రెస్‌గా ఎదిగిన కియారా అద్వానీ.. టాలీవుడ్లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే.. మహేష్ బాబుతో వర్కౌటైన మ్యాజిక్, రామ్ చరణ్‌తో విషయంలో ఫెయిలవుతోంది. ‘వినయ విధేయ రామ’ తేడా కొట్టినా, ‘గేమ్ ఛేంజర్’తో మరో అవకాశమొచ్చినప్పటికీ.. కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. దాంతో కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది.
హిందీలోనూ ‘వార్ 2’ రూపంలో మరో డిజాస్టర్ కియారా అద్వానీ ఖాతాలో చేరింది. టూ పీస్ బికినీ వేసినా.. హీరోతో రొమాన్స్ సీన్స్‌లో రెచ్చిపోయినా కూడా హృతిక్- ఎన్టీఆర్ మేనియా ముందు కియారా కనబడలేదు. పోనీ బొమ్మ హిట్ పడి క్రెడిట్ కాస్తైనా కొట్టేయొచ్చు అనుకుంటే.. సీన్ రివర్స్ అయ్యింది. అంతలో ప్రెగ్నెన్సీ కారణంగా డాన్ 3, శక్తి షాలిని చిత్రాలు మిస్ చేసుకున్నారు. డెలివరీ అయ్యాక.. ఇక ఫుల్ ఫ్లెడ్జ్‌గా టాక్సిక్ ప్రాజెక్ట్‌కు డేట్స్ కేటాయించారు. ఈ మూవీతో శాండిల్ వుడ్ డెబ్యూకి కియారా రెడీ అయ్యారు.
Also Read: Dhurandhar Collections: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు.. ‘జవాన్’ రికార్డు బద్దలు!
కన్నడలో అత్యంత భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న సినిమా ‘టాక్సిక్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుంచి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మేకర్స్ సినిమాను హాలీవుడ్ లెవల్లో తీర్చిదిద్దుతుండడంతో హైప్ మాములుగా లేదు. హాలీవుడ్, నార్త్, సౌత్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు టాప్ హీరోయిన్లను రంగంలోకి దింపింది చిత్ర యూనిట్. కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యూమా ఖురేషీ, తార సుతారియా, రుక్మిణీ వసంత్ లాంటి ముద్దుగుమ్మలు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాలో నదియా క్యారెక్టర్‌ను కియారా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. నయన్ కన్నా కియారాకే పారితోషికం ఎక్కువట. సౌత్‌లో సరైన హిట్టు లేకున్నా.. కియారా భారీగానే డిమాండ్ చేస్తున్నారు. మరి టాక్సిక్‌తో ట్రాక్ ఎక్కుతారో చూడాలి.