Kiara Advani : గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది.ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ చిత్రం నుంచి ‘జరంగండి జరగండి’ అనే ఫస్ట్ సింగల్ ను మార్చిలో రాంచరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసారు. ఈ మాస్ బీట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో పాల్గొన్న కియారా ఈ జరగండి పాట షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. జరగండి పాట షూటింగ్ 10 రోజుల పాటు జరిగిందని కియారా తెలిపింది. ఒకపాటకు ఇన్ని రోజుల షూటింగ్ తాను ఎప్పుడు చేయలేదని కియారా చెప్పారు. అయితే ఈ పాట కోసం 3 నుంచి 4 గంటల పాటు రిహార్సల్స్ చేసినట్లు ఆమె తెలిపింది.ఈ పాటలో ఎన్నో కష్టమైన స్టెప్స్ ఉంటాయి.చరణ్ కు మ్యాచ్ అయ్యేలా స్టెప్స్ వేయడానికి కాస్త శ్రమించాల్సి వచ్చింది.ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అని కియారా తెలిపారు.