Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Carens: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకికి బలమైన పోటీ ఇచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (KIA) సిద్ధమైంది. దీనిలో భాగంగానే కంపెనీ తన మొట్టమొదటి ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ (CNG) కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం కంపెనీ తన పాపులర్ 7-సీటర్ మోడల్ అయిన ‘కియా కేరెన్స్’ను ఎంచుకుంది. నిజానికి కేరెన్స్ ప్రస్తుతం సీఎన్జీతో అందుబాటులో ఉన్నప్పటికీ, అది డీలర్ లెవల్ (ఆఫ్టర్ మార్కెట్ లొవాటో కిట్) ఫిట్మెంట్ మాత్రమే, కంపెనీ నుంచి అధికారిక ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ వెర్షన్ కాదు.
ఇప్పుడు కియా ఈ 7-సీటర్‌లో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీని అందించాలని నిర్ణయించుకుంది, ఇది కంపెనీ అమ్మకాల పరంగా ఒక ‘గేమ్‌చేంజర్’గా మారే అవకాశం ఉంది. తాజా నివేదికల ప్రకారం, ఈ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వెర్షన్‌ను 2026 దీపావళి పండుగ సీజన్ కంటే ముందే కంపెనీ లాంచ్ చేసే అవకాశముంది. ఇటీవల ఈ కారు పూణే-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై టెస్టింగ్ చేస్తూ స్పై షాట్స్‌లో కనిపించింది. ప్రస్తుతం కియా కేరెన్స్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఈ కొత్త సీఎన్జీ ఆప్షన్‌ను కారులోని 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో జత చేసి ఇచ్చే అవకాశం ఉంది. సాధారణ పెట్రోల్ వెర్షన్లో ఈ ఇంజిన్ 115 HP పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సీఎన్జీ మోడ్‌లోకి మారినప్పుడు పవర్ గణాంకాలు కొంత తగ్గినప్పటికీ, మైలేజ్ గణనీయంగా పెరిగి కారు నిర్వహణ ఖర్చు (రన్నింగ్ కాస్ట్) బాగా తగ్గుతుంది.
Also Read
భారత మార్కెట్లో లాంచ్ అయ్యాక ఈ కారు మారుతి సుజుకి ఎర్టిగా (Ertiga), ఎక్స్ఎల్6 (XL6) వంటి ప్రజాదరణ పొందిన 7-సీటర్ సీఎన్జీ మోడళ్లకు ప్రత్యక్ష పోటీగా నిలుస్తుంది. ప్రస్తుతం కియా కేరెన్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.27 లక్షల నుంచి ప్రారంభమై రూ.21.67 లక్షల వరకు ఉంది. జూలై నెలలో కంపెనీ 5,352 యూనిట్ల కేరెన్స్ కార్లను విక్రయించింది. కాగా, గత ఏడాది (గత సంవత్సరం జూలై)లో ఇవి 7,602 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఏడాది ప్రాతిపదికన అమ్మకాల్లో 30 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, జూన్ నెల (4,847 యూనిట్లు)తో పోలిస్తే జూలైలో అమ్మకాలు పుంజుకున్నాయి. సీఎన్జీ వెర్షన్ మార్కెట్లోకి వస్తే అమ్మకాలు మరింత వేగంగా పుంజుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
తాజావార్తలు
-
El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
-
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..