Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..
- ముచ్చుమర్రి బాలిక కేసులో కొనసాగుతోన్న పోలీసుల గాలింపు చర్యలు..
- ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముళ్లపొదలు తొలగింపు..
- మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muchumarri Missing Girl Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలికపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముల్లచెట్లను తొలగిస్తున్నారు పోలీసులు.. మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించారు.. దీంతో, బాలిక మృతదేహాన్నరి ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. అయితే, ఈ పరిణామాలతో బాలిక కేసు ఎప్పుడు ఎటు మలుపుతీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. బాలిక మృతదేహం ఆచూకీ కనుక్కోవాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశామని పోలీస్ దర్యాప్తులో ముగ్గురు మైనర్ బాలురు అంగీకరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. వారు ఇచ్చిన సమాచారం మేరకే బాలిక మృతదేహాన్ని వెతికే పనిలోపడిపోయారు.
Read Also: Road Accident: హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు లారీలు ఢీ, ఒకరు మృతి
Also Read
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఇక, అత్యాచారం, హత్యకు గురైన బాలిక బంధువులు ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.. 6 రోజులైనా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో రోడ్డెక్కారు బంధువులు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఎత్తిపోతల కాలువలో పడేసామని మైనర్ బాలురు చెప్పడంతో 4 రోజులుగా కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.. బాలిక మృతదేహం దొరకకపోవడంతో బంధువుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బాలిక మృతదేహాన్ని వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, 4 రోజులుగా బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మకోవైపు.. ముగ్గురు మైనర్ బాలురను ముచ్చుమర్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు పోలీసులు.. రెండు వేర్వేరు స్థలాలను పోలీసులకు బాలురు చూపించారు.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాలురు చూపించిన స్థలాల్లో ఏమైనా పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటనలో బాలుర పాత్ర మాత్రమేనా, ఇంకా ఎవరిపాత్ర అయినా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ తరుణంలో.. జేసీబీతో ముల్ల పొదలను తొలగించడంతో.. అక్కడే మృతదేహాన్ని పాతిపెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..