NTV Telugu Site icon

TG Cabinet: భూమాతగా ధరణి, కొత్త రేషన్‌ కార్డులు, జాబ్‌ క్యాలెండర్‌.. కేబినెట్‌ నిర్ణయాలివే..

Tg Cabinet

Tg Cabinet

TG Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీహాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌.. ధరణి పోర్టల్‌ను భూమాత పోర్టల్‌గా మార్చడంతో పాటు పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇండియా స్కిల్స్ వర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read Also: Thummala: బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా?

తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..
*ధరణి పోర్టల్‌ను భూమాత పోర్టల్‌గా మార్చడం
*ఇండియా స్కిల్స్ వర్శిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం.
*జాబ్‌ క్యాలెండర్‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం. రేపు అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్న సీఎం రేవంత్‌.
*కొత్త రేషన్‌ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు
*ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
*క్రికెటర్ సిరాజ్, బాక్సర్‌ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం
*గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం.
*జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం