‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నటించిన #సింగిల్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో విడుదల కానుంది. కళ్యాణ ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్‌లో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు సృష్టించాయి. ఈ సందర్భంగా కేతిక శర్మ విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్‌తో సూపర్
ఫిల్మ్
గీతా ఆర్ట్స్‌లో పనిచేయడం నా డ్రీమ్. అల్లు అరవింద్ గారి సినిమా అంటే అద్భుత కంటెంట్ ఉంటుందని నమ్మకం. కథ విన్నప్పుడు ఆనందంతో ఒప్పేసాను. ఇది సరదాగా, ఫన్‌తో నిండిన ఎంటర్‌టైనర్. పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్‌తో సూపర్ ఫిల్మ్!
మీ క్యారెక్టర్ గురించి?
నేను పూర్వా పాత్రలో కనిపిస్తాను. ఆమె స్వతంత్ర, ప్రాక్టికల్ అమ్మాయి. కథలో ఎమోషన్ నా పాత్ర ద్వారా వస్తుంది. రొమాంటిక్ కామెడీ అయినా, లవ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్ర చాలా రిలేటబుల్.
శ్రీ విష్ణుతో వర్క్ ఎలా అనిపించింది?
శ్రీ విష్ణు అద్భుతమైన వ్యక్తి, సింపుల్, హంబుల్. నటనలో ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్, స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ యూనిక్. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం.
ఇవానాతో అనుభవం?
ఇవానా చాలా అందమైన, పాజిటివ్ అమ్మాయి. స్క్రీన్‌పై కొన్ని సన్నివేశాలు ఉన్నా, ఆఫ్-స్క్రీన్‌లో మేము మంచి స్నేహితులమైనాం.
‘అదిదా సర్ప్రైజ్’ తర్వాత డాన్స్ నంబర్ ఉందా?
‘అదిదా సర్ప్రైజ్’ వైరల్ కావడం సంతోషం. కానీ సింగిల్లో అలాంటి డాన్స్ నంబర్ లేదు. ఇది పూర్తి ఫన్ ఎంటర్‌టైనర్. నవ్వులు,
ఆనందం గ్యారంటీ!
డైర్శకుడు కార్తీక్ రాజు గురించి?
కార్తీక్ గారు విజన్‌తో కూడిన ఫిల్మ్‌మేకర్. సినిమాను హైలీ ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దారు. సెట్‌లో అందరినీ సౌకర్యవంతంగా చూసుకున్నారు.
కెరీర్‌పై సంతృప్తి?
నా కెరీర్‌పై సంతోషంగా ఉన్నాను. ఫలితాల కంటే పనిని ఆస్వాదిస్తాను. నటిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తాను.
డ్రీమ్ రోల్?
రష్మిక గారి ‘గర్ల్‌ఫ్రెండ్’ లాంటి పాత్రలు, సాయి పల్లవి, కీర్తి సురేష్ గారి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలనుంది.
ఛాలెంజింగ్ సన్నివేశం?
కామెడీ చేయడం కష్టం. ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశంలో శ్రీ విష్ణు గారి టైమింగ్‌తో సమన్వయం చేయడం సవాలుగా అనిపించింది.
కొత్త ప్రాజెక్ట్‌లు?
హిందీలో ఒక సినిమా, తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేస్తున్నాను. మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడిస్తారు.
ప్రేక్షకులకు సందేశం?
మే 9న సింగిల్ విడుదలవుతోంది. కుటుంబంతో థియేటర్‌కి రండి. ఈ సమ్మర్ రొమాంటిక్ కామెడీ నవ్వులు, ఆనందం పంచుతుంది!