Nagoba Jatara: గిరిజన ఆరాధ్యదైవం నాగోబాను దర్శించుకోనున్న కేంద్ర మంత్రి.. జాతర విశేషాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagoba Jatara: ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర మొదలవుతుంది. ఈ వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. 11 గంటల వరకు కేస్లాపూర్ చేరుకోనున్నారు. గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను నేతలు దర్శించుకోనున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో జిల్లా నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని అర్జున్ ముండా, బండి సంజయ్ ప్రసంగించనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఇక నాగోబా జాతర ప్రత్యేకత విషయానికి వస్తే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరలో శనివారం సాయంత్రం ఎడ్ల బండ్లతో గోవాడ్‌కు చేరుకుంటారు. ఆపై నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి , ఆపై ప్రత్యేక పూజలు చేసి ఏడు రకాల పాము పుట్టలను తయారుచేసి వాటికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటుగా, ఆదివాసీలు విశ్వసిస్తారు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
KTR: ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన.. రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలాన్ని మట్టికుండలలో మెస్రం వంశ మహిళలు అందిస్తారు. గిరిజన సాంప్రదాయ డోలు, పెప్రి, కాళికోం వాయిద్యాలతో పూజాసామాగ్రిని గంగాజలంతో పాటు శోభాయాత్ర నిర్వహించి నాగోబా అలయానికి వెళ్లి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏడు పుట్టల వద్ద నవ ధాన్యాలు, ఆవు పాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర నేడు రాత్రి 10 గంటలకు నాగోబాకు మహాపూజతో ప్రారంభంకానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు.
ఈ నెల 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారరుకానున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖలు రాఘవ జాతరకు కావలసిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి కఅన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసి నిర్మల్, ఉట్నూర్, అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ డిపోల నుంచి నేటి నుంచి 28వరకు ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ఆర్ ఎం జానీరెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!