Site icon NTV Telugu

Kesineni Swetha: మేనిఫెస్టోలోని హామీలను కూటమిలోని ఏ పార్టీ అమలు చేస్తుందో ప్రకటించాలి..

Kesineni Swetha

Kesineni Swetha

Kesineni Swetha: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్‌కి, నాన్‌లోకల్‌కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35, 42వ డివిజన్లలో తన తండ్రి కేశినేని నాని తరఫున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలో గెలిస్తే వాళ్ల ప్రలోభాలు,లాభియింగ్ కోసం పనిచేసుకుంటారని.. గెలవక పోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్లి వాళ్ళ బిజినెస్‌లు చూసుకుంటారని ఎద్దేవా చేశారు. కేశినేని నాని విజయవాడ ప్రజలకు ముద్దు బిడ్డ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడే పుట్టారు.. పుట్టిన ఊరు కోసం విజయవాడ ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి కేశినేని నాని అంటూ పేర్కొన్నారు.

Read Also: Dadisetti Raja: గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలి..

10 సంవత్సరాలుగా విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. కేశినేని భవన్ ద్వారా విజయవాడ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి కేశినేని నాని.. నీతిగా నిజాయితీగా విజయవాడ ప్రజల కోసం పనిచేసే వారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ప్రజలకు సూచించారు. 8000 కోట్లతో హాస్పిటల్స్, ఫ్లైఓవర్, ఎయిర్ పోర్ట్, ఇలా విజయవాడకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు తెచ్చింది కేశినేని నానినే అంటూ ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్య చాలా ఉందని.. 265 గ్రామీణ ప్రాంతాలకు వాటర్ ట్యాంక్‌లు అందించిన ఘనత కేశినేని నానిదని చెప్పారు. అలాగే ఆటో నగర్ లో 60 సంవత్సరాల నుంచి ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు కేశినేని నాని 6 లక్షల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మించారన్నారు. 60 సంవత్సరాలు వెనుక బడి ఉన్న విజయవాడను గత 10 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని.. ఉపాధి కల్పనా అవకాశాలు యువతకు కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కచ్చితంగా కేశినేని నానిని ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆసిఫ్‌ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు..

42వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేత మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం గురించి బీజేపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీజేపీ పాలనలో ముస్లిం మైనార్టీలను ఏ విధంగా అణగతొక్కారో ప్రజలంతా చూశారన్నారు. కేంద్రంలో ముస్లిం మైనార్టీలపై విరుచుకుపడుతూ, వాళ్లని అణగదొక్కేలా చట్టాలు చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ముస్లిం మైనార్టీలను ప్రేమగా చూస్తామంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఆమె ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు, హిందువులు , అన్ని కులాల ప్రజలు కలసి మెలిసి జీవిస్తున్నారని ఆమె చెప్పారు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఓ మాయా జాబితా అని.. బీజేపీకి ఎటువంటి సంబంధం లేకుండా మేనిఫెస్టో ఉందన్నారు. మేనిఫెస్టోలోని హామీలను మూడు పార్టీల్లో ఏ పార్టీ అమలు చేస్తుందో ప్రకటించాలని కేశినేని శ్వేత డిమాండ్ చేశారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో వైసీపీని కాపీ కొట్టినట్లుగా ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో మాయమైపోయిందని… హామీల అమలు చేయలేదన్నారు. 14 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చేసిన మేలు శూన్యమని ఆరోపించారు.

Exit mobile version