Kerala IMax: ఫలించిన సినిమా ప్రేమికుల నిరీక్షణ.. కేరళలో మొదటి ఐమాక్స్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala IMax: సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కేరళలోని మొదటి ఐమాక్స్ థియేటర్ తిరువనంతపురంలో ప్రారంభమంది. లులు మాల్‌లోని పీవీఆర్ సూపర్‌ప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీనింగ్ ప్రారంభమైంది. ప్రారంభ చిత్రం హాలీవుడ్ చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్. డిసెంబర్ 16న అవతార్ విడుదలైన రోజున తిరువనంతపురంలోని ఐమాక్స్ ని ప్రారంభిస్తామని మేకర్స్ మొదట ప్రకటించారు, కానీ అది జరగలేదు. అందుబాటులోకి వచ్చిన మొదటి రోజు థియేటర్ కు మంచి స్పందన వచ్చింది. అవతార్ విడుదలై కొన్ని రోజులు కావస్తున్నా ఐమాక్స్ లో సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఎగబడ్డారు. టిక్కెట్ ధరలు రూ.1230, రూ.930, రూ.830. కేరళలో ప్రారంభమైన ఐమాక్స్ దేశంలో 22వది.
Read Also: Solar Stove : గ్యాస్ ధర పెరిగినా డోంట్ వర్రీ.. వచ్చేస్తోంది సోలార్ స్టవ్
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
కేరళకు చెందిన మొట్టమొదటి ఐమాక్స్ తిరువనంతపురంలోని లులు మాల్‌కు వస్తుందని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో పుకారు వచ్చింది. ఐమాక్స్ ఆసియా థియేటర్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్ అక్టోబర్‌లో ట్విట్టర్‌లో ఈ ఊహాగానాలకు ముగింపు పలికారు. కేరళలో ఐమాక్స్ స్క్రీన్ల ప్రారంభానికి సంబంధించి ప్రీతమ్ తిరువనంతపురం, కొచ్చిలను సందర్శించారు. తిరువనంతపురం లులు మాల్‌లోని ఐమాక్స్ కేరళలో కార్యకలాపాలకు నాంది మాత్రమేనని ఆయన తెలియజేశారు. కొచ్చిలో ఐమాక్స్ సాధ్యాసాధ్యాలను కూడా బృందం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా సెంటర్ స్క్వేర్ మాల్‌లోని సినీపోలీస్, లులుమాల్‌లోని పీవీఆర్‌లను సందర్శించారు. కొచ్చి కూడా ఐమాక్స్ థియేటర్‌కి అనువైన నగరంగా పరిగణించారు.
Read Also: Guinness Record: వీడు మామూలోడు కాదు.. గడ్డంతో గిన్నీస్ రికార్డ్
ఇదిలా ఉంటే, అవతార్ ది వే ఆఫ్ వాటర్ ప్రపంచ సినిమా చరిత్రలో అతిపెద్ద విజయం. డిసెంబర్ 2009లో విడుదలైన ఈ చిత్రం 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్‌గేమ్‌తో రెండో స్థానానికి చేరుకుంది. అయితే అవతార్ 2 విడుదలకు ముందే అవతార్ ప్రపంచవ్యాప్తంగా రీరిలైజైంది. మార్చి 2021లో రీ రిలీజైన అవతార్ మూవీ ఉత్తమ కలెక్షన్లను సాధించింది. అవతార్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!