Ganja With Students: గంజాయి అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు
- కేరళలోని ఇడుక్కిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన.
- గంజాయి అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి.
- అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja With Students: కేరళలోని ఇడుక్కిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల బృందం అనుకోకుండా గంజాయి బీడీ అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మొదటగా విషయం విన్న అక్కడి ఎక్సైజ్ అధికారి ఆశ్చర్యపోయారు. త్రిసూర్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టూర్‌కు వెళ్లిన ఘటన ఆదిమాలిలో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థులు పొరపాటున ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లి.. అగ్గిపుల్లల కోసం అధికారులను అడగ్గా, ఎక్సైజ్ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయి, హాషీష్ ఆయిల్, నిషిద్ధ పదార్థాలను నింపిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిషేధిత పదార్థాలతో దొరికిన ఇద్దరు మైనర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
Read Also: Amaran : అమరన్ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
అందిన సమాచారం ప్రకారం, త్రిసూర్‌లోని ఎయిడెడ్ పాఠశాలకు చెందిన మున్నర్ ట్రిప్ కు వెళ్లారు 100 మంది విద్యార్థులు. ఒక హోటల్లో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు గంజాయి బీడీ కాల్చడానికి బయటకు వచ్చారు. అయితే, దానిని వెలిగించడానికి అగ్గిపుల్లలు లేకపోవడంతో.. ఎక్సైజ్ కార్యాలయం వెనుక వైపు చూసి అక్కడికి చేరుకున్నామని, అకస్మాత్తుగా అధికారులను చూడగానే ప్రమాదాన్ని పసిగట్టి బయటకు పరుగులు తీసారని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసును విచారణ చేయగా నిషేధిత పదార్థాలు బయటపడ్డాయని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గంజాయి, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు విద్యార్థులపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థులు అదుపులో తీసుకుని విచారించి సూమారు ఆరు గ్రాముల గంజాయిని సీజ్ చేసారు అధికారులు. చాలామంది పిల్లలు తొలిసారిగా గంజాయి సేవించినటు విచారణలో వెల్లడైంది.
Read Also: Gachibowli Fly Over: గచ్చిబౌలి ఫ్లై ఓవర్ క్లోజ్.. ఎప్పటి వరకు అంటే..
ఉపాధ్యాయులతో పాటు ఇతర విద్యార్థులను వెనక్కి పంపినట్లు అధికారి తెలిపారు. అయితే ఆ ఇద్దరు విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రులను పిలిపించి తమ వెంట పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల సందర్శనల సమయంలో మాదక ద్రవ్యాల వినియోగం విరివిగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!