బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లకు కావాల్సిన సీట్లను బీజేపీ గెలుచుకోలేదని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. తాను తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎంతో మంది నిపుణులు, సెఫాలజిస్టులతో మాట్లాడనని చెప్పారు. శుక్రవారం కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారం కోల్పోతుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Fisher Man: తస్సదియ్యా.. చేపలు పడదామనుకుంటే ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్..
రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను అంతం చేయాలని, నియంతృత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో బీజేపీకి 400 సీట్లు కావాలని అంటున్నారని ఆరోపించారు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని.. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని, ఎల్జీని సొంతం చేసుకుంటామని చెపక్పారు. దేవుడు తనకు 21 రోజులు సమయం ఇచ్చాడని.. 24 గంటలు పనిచేస్తానని, దేశమంతా తిరుగుతానని చెప్పారు. ఈ నియంతృత్వాన్ని అంతం చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Pakistan: PIA ఎయిర్‌లైన్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
బీజేపీ ఈసారి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో చాలా సీట్లు కోల్పోనున్నట్లు తెలిసిందన్నారు. ఫోన్‌లో చాలా మంది సెఫాలజిస్టులతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు బీజేపీకి మెజారిటీ రాదనే చెబుతున్నారన్నారు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం 7 ఎంపీ సీట్లలో బీజేపీ ఓడిపోతుందన్నారు.
ఆప్ తూర్పు ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కృష్ణానగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంట్ స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయనకు విముక్తి లభించింది. మధ్యంతర బెయిల్ దొరకడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : ఎన్నికల కోడ్ అయిపోగానే మహిళలకు మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తాం
