Site icon NTV Telugu

Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!

Accident

Accident

Keesara Toll Plaza: ఎన్టీఆర్ జిల్లా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా వద్ద ఘోర సంఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక సిమెంట్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖరీదైన బీఎండబ్ల్యూ (BMW) కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!

హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్, కీసర టోల్‌ప్లాజాను దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ బ్రేకులు అకస్మాత్తుగా విఫలం కావడంతో డ్రైవర్ నియంత్రించలేకపోయారని, ఆ క్రమంలోనే పక్కనే ఉన్న కారుపైకి ట్యాంకర్ దూసుకెళ్లి బోల్తా పడిందని ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ బరువుకు కారు పూర్తిగా నలిగిపోవడంతో లోపల ఉన్న వారు అందులోనే చిక్కుకుపోయారు. అయితే అందులో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు.

Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!

ఘటన జరిగిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. కారుపై పడిన భారీ ట్యాంకర్‌ను తొలగించేందుకు క్రేన్లను రప్పిస్తున్నారు. కారు లోపల ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే, లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ భారీ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీసర టోల్‌గేట్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ వాహనాలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version