Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: గత కొద్ది కాలంగా సమాజంలో సోషల్ మీడియా సంబంధించిన అనేక ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి అలాగా ఉండగా మరికొందరు దిగిజారి బతికేస్తున్నారు. తాజాగా విజయవాడలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భవానీపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు గత రెండు సంవత్సరాలుగా ఆ మహిళను న్యూడ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని, ఆమె భర్తను హత్య చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపుల కారణంగా బాధితురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఇప్పటికే నిందితుడు బాధితురాలితో రూ.21 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా మరో రూ.2 కోట్లు ఇస్తే ఫొటోలను డిలీట్ చేస్తానని డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వేధింపులను తట్టుకోలేక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే వారు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు.
SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!
దీనితో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. జోజి నగర్‌లో కిరాణా దుకాణం నడుపుతున్న వెంకటేశ్వర్లు ఇప్పటివరకు మూడు వివాహాలు చేసుకున్నాడని తెలిసింది. అతని ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు మరికొన్ని మహిళల న్యూడ్ ఫొటోలు కూడా లభించడంతో మరింత షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది మహిళలు బాధితులయ్యారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!