KTR: మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు.. తెలంగాణలో అందరికీ హీరోనే
- కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.
- మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు, తెలంగాణలో అందరికీ హీరోనన్న కేటీఆర్
- తాను కేసీఆర్ కుమారుడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని వ్యాఖ్యలు.
- కేసీఆర్ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఆయనను మళ్లీ గెలిపించాలని కోరిన కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: నేడు 71వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న కేసీఆర్ కు పెద్దెతున్న శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తన తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తన అనుభూతులను వ్యక్తం చేశారు. “మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు, తెలంగాణలో అందరికీ హీరోనే” అంటూ ఆయన పేర్కొన్నారు. తాను కేసీఆర్ కుమారుడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు.
Read Also: Amardeep Kumar: రూ.1700 కోట్లతో దుబాయ్కి పారిపోయిన ఫాల్కన్ చైర్మన్
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో డబ్బు బలం లేకుండా, కండ బలం లేకుండా, కానీ గుండె బలం మీదే పోరాడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఆయన చావు నోట్లో తల పెట్టి తెలంగాణ కోసం పోరాడారని కొనియాడారు. ఇక కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు సభ్యులు మహేష్ రెడ్డి రూ. 3 లక్షల చెక్ అందజేశారని, ఈ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల సహాయార్థం వినియోగించాలని కోరారు. మహేష్ రెడ్డికి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Gold Price: మరోమారు దూకుడు చూపిస్తున్న బంగారం ధరలు..
ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. గత 14 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. గ్రామాలకు, పట్టణాలకు వెళ్లిన ప్రతిసారీ ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. “మన లక్ష్యం ఒక్కటేనని.. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం. రాబోయే మూడేళ్లు అందరూ కలిసి పని చేసి తెలంగాణను బలంగా నిలబెట్టాలని కోరారు. కేసీఆర్ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఆయనను మళ్లీ గెలిపించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!