భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది.. ప్రజాస్వామ్యంలో మెచ్యూరిటీ మన దేశంలో ఇంకా రాలేదు అని ఆయన వ్యాఖ్యనించారు. ఎలక్షన్ వచ్చాయి అంటే ఆగం ఆగం కావొద్దు.. అభ్యర్ధి గుణం గణం పరిగణలోకి తీసుకోవాలి.. అభ్యర్ధుల వెనుక ఎ పార్టీ ఉన్నది.. ఆ పార్టీ చరిత్ర ఏంటి అనేది గ్రామల్లో పట్టణల్లో చర్చ జరగాలి.. అప్పుడే నాయకుడ్ని ఎన్నుకునే విధానం జరుగుతుంది.. మన దేశంలో ఎలక్షన్ వచ్చింది అంటే అబద్దాలు మోసాలు చేస్తున్నారు.. ఇలాంటివి పోవాలి మంచి జరగాలి అంటే గ్రామాల్లో అభివృద్ధి చేసిన పార్టీ గురించి చర్చ జరగాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Also: SBI Recruitment 2023 : SBI లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
ఇప్పుడు మనకి మూడోసారి ఎన్నిక జరుగుతుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. న్యాయబద్దంగా 2005 లోనే తెలంగాణ రావాల్సి ఉంది.. నేను ఆమరణ నిరహర దీక్ష చేస్తే కేసిఆర్ చచ్చుడో తెలంగాణ రావోడో అనే దీక్ష చేస్తే చచ్చినట్లు తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ వచ్చిన తరువాత కరెంట్ సమస్య తీర్చుకున్నామన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.. ఇంటింటికి మిషన్ భగీరద ద్వారా నీళ్ళు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేసీఆర్ అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నాడు చూడలేదు …బీఅరెస్ పార్టీ వచ్చినకనే ఆలోచన చేశాం…ఉమ్మడి జిల్లా ప్రజలకు సీతమ్మ సాగర్ నీళ్ళు అందిస్తాం.. రైతుల కోసం రైతు బంధు తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..
పావు ఏకారం భూమి ఉన్న రైతన్నకి కూడా రైతు భీమా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్ వెల్లడించారు. ధరణి పొట్రాల్ ద్వారా అద్బుతాలు జరుగుతున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి తీసి బంగాళాఖాతం లో వేస్తాం అని అంటున్నారు.. వాళ్ళు వచ్చేది లేదు చచ్చేది లేదు.. ధరణిపుణ్యం వల్ల దళారి వ్యవస్థ పోయింది.నేరుగా సమస్య పరిష్కరం అవుతుంది.. ధరణి తీసేస్తే మళ్ళీ ఫైరావీకారులు దళారీ చేతులోకి పోతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి మార్చేస్తాం అంటున్న పార్టీ ల వైఖరి ఎంటో చూడండి.. గుడ్డిగా చెప్పే మాటాలు నమ్మి ఓట్లు వెయ్యకండి.. రైతుబందువు ఇచ్చి కేసిఆర్ దుబరా చేస్తున్నడని ఉత్తమ్ అంటున్నాడు.. రైతుబందువు దుబారానా అని ప్రజలను ప్రశ్నించిన కేసిఆర్.. ఆలోచించకుండా ఓటు వేస్తే ఆగం అవుతాం…మూడు గంటల కరెంట్ వస్తుంది.. 24 గంటల కరెంట్ ఉండాలి అంటే మెచ్చా గెలవాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.