KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
జగిత్యాల గడ్డపై గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం ఉప్పెనలా సాగింది. చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతుండటంతో అశేష జనవాహిని తరలివచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌కు, ప్రతిపక్ష బీఆర్ఎస్కు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ.. కేసీఆర్ సభ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. తనదైన శైలిలో ప్రాసలు, జాతీయాలు జోడిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగించింది. టీవీలు, సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది కేసీఆర్ గళం కోసం నిరీక్షించగా.. ఆయన మాటలతో సభా ప్రాంగణం దద్ధరిల్లిపోయింది. రాజకీయ వేడి రాజుకున్న తరుణంలో కేసీఆర్ పదునైన వ్యాఖ్యలు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
జగిత్యాలలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ ఒక సభలా కాకుండా, ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారింది. సభ ప్రారంభంలో కేసీఆర్ మైక్ పట్టుకోగానే జనం కేరింతలు, నినాదాలతో మైదానం మార్మోగిపోయింది. ఈ వేదికగా సీనియర్ నేత జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఆయనను వెంటనే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read:Vedanta: సంచలన నిర్ణయం తీసుకున్న వేదాంత.. ఇక నుంచి 5 కంపెనీలుగా.. ఒక్క షేరుకు 5 కంపెనీల్లో షేర్లు..
“జీవన్ రెడ్డికి, నాకు 40 ఏళ్ల స్నేహం ఉంది. రాజకీయాలు వేరైనా మేము ఒకరినొకరు గౌరవించుకున్నాం. ఆయన గుండె ధైర్యం ఉన్నోడు, తెలంగాణ ప్రయోజనాల కోసమే నేడు నా వెనుక నడిచేందుకు సిద్ధమయ్యారు” అని కేసీఆర్ భావోద్వేగంగా పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి జగిత్యాల బాధ్యతలే కాకుండా పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బాధ్యతలను కూడా అప్పగిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రసంగంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పాలనలో అనుభవం లేకపోతే ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో వివరిస్తూ, సంక్షేమ పథకాల అమలుపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. “జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజలు ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించారు, ఆయనకు పదవులు కొత్త కాదు. మేమిద్దరం అన్నదమ్ముల్లా కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తాం” అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ పునరాగమనంతో తెలంగాణ రాజకీయాల్లో మునుపటి జోష్ కనిపిస్తోంది. ఈ సభతో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల సమరానికి సిద్ధమనే సంకేతాలు పంపాయి.
తాజావార్తలు
-
KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
-
Pakistan: పాకిస్థాన్‌కు చేజారిన రూ.12,500 కోట్ల డీల్.. సూడాన్ సంక్షోభంలో సౌదీ కీలక నిర్ణయం!
-
Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం
-
Peddi : ‘పెద్ది’ వాయిదాకి అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
-
JEE Mains Session 2 Result 2026: జేఈఈ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?