Site icon NTV Telugu

KCR-Harish Rao : కాళేశ్వరం నోటీసులపై కేసీఆర్. హరీష్‌రావు మధ్య మంతనాలు..

Harish Rao Kcr

Harish Rao Kcr

KCR-Harish Rao : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,  మాజీ మంత్రి హరీష్ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై హరీష్‌రావుతో తగినంత సమాలోచనలు జరిపినట్లు సమాచారం.

Anushree Satyanarayana: ఆ నలుగురు వీరే.. దిల్ రాజుపై కోర్టుకు వెళ్తా!

విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అంశాలు, ఎక్కడా లోపాలు జరిగాయన్న విషయాలపై పూర్తిగా ఆరా తీసినట్లు, ఇది కాకుండా, NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏం సూచించింది? బ్యారేజీ కుంగడపై సాంకేతిక కారణాలు ఏమిటన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరైన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ ఫోన్ ద్వారా మాట్లాడినట్లు,  కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి? ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయన్న విషయాలపై కూడా ఆయన చర్చించినట్లు సమాచారం.

YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు..!

Exit mobile version