NTV Telugu Site icon

BRS: కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్..

Brs

Brs

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read Also: Botsa Satyanarayana: మళ్లీ జగన్‌ ప్రభుత్వం రావడం ఖాయం..

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక, అభ్యర్థిపై చర్చించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై తీవ్రంగా చర్చించారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యుల్లో ఒకరైన.. ఆమె చెల్లి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తుంది. కాగా.. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి తీవ్ర పోటీ ఉండనుంది. ఇప్పటికే.. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించగా, ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Minister Sridhar Babu: ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటాం.. అభ్యర్థులను చూసి ఓటు వేయాలి