KCR : తొమ్మిదేళ్లు సరిగ్గా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందని, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవి అమలు కాలేదన్నారు బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన మెదక్‌లో మాట్లాడుతూ.. రైతు బంధు వచ్చిందా..? రుణమాఫీ అయ్యిందా..? కరెంట్ సరిగా వస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సరిగా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..? అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు…ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టారని, ఐదు నెలల్లో తెలంగాణ అంతా ఆగమాగం అయ్యిందన్నారు. రైతు బంధు పొలం దున్నితేనే ఇస్తారట.. వరి నాటెసేటప్పుడు వేయాల్సిన రైతు బంధు కొత కోసిన తర్వాత ఇస్తుంది… దీనికంటే పెద్ద జోక్ ఉంటుందా అని ఆయన మండిపడ్డారు. కరెంట్ పోవడం వల్ల పరిశ్రమలు తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంది..ఐటీ పరిశ్రమ దెబ్బ తినే అవకాశం ఉందని, మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ కి నీళ్లు రావాలంటే ఇక్కడ మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. కేసీఆర్ నర్సాపూర్ ని ఎలా అభివృద్ధి చేశాడో తెలుసు అని, మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్లు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే వెనక్కి తీసుకెళ్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’వృద్దులకు 4 వేలు ఇస్తానన్న పెన్షన్ ఏది. మహిళలకు 2500 ఇస్తున్నామని రాహుల్ గాంధీ నిర్మల్ సభలో చెబుతున్నారు. మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు..? నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కాదా..? ముసలి తనానికి కుసుమ గుడాలు అన్నట్టు ఎందుకు పోయావు. నరేంద్ర మోడీ వల్ల పైసా లాభం లేదు. సబ్ కా సాత్ సత్య నాష్ అయ్యింది. మోడీ ఎజెండాలో పేదల బాధలు, పేదల కష్టాలు, రైతుల ఇబ్బందులు ఉండవు. యూపీ ఎన్నికలు వస్తే మళ్ళీ స్వారీ చెప్పి ఎన్నికలకు పోయిండు. గిరిజన తండాలను గ్రామ పంచాయితీలు చేసింది కేసీఆర్. 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్. అందరం ఏకమై తెలంగాణాని కాపాడుకోవాలి. కృష్ణా, గోదావరి నీళ్లు మోడీ తమిళనాడు కి తీసుకువెళ్లే కుట్ర చేస్తున్నాడు. వెంకట్రామిరెడ్డి అత్యదిక మెజారిటీ గెలుస్తాడాని సర్వేలు చెబుతున్నాయి. నర్సాపూర్ లో ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర. పటాన్ చెరు బయలుదేరిన కేసీఆర్. ‘ అని కేసీఆర్ అన్నారు.
Also Read
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!