Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
- పండుగల వేళ సామాన్యులకు షాక్
- 18 రోజుల్లోనే కిలో చక్కెరకు రూ.18 పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Price Hike: మధ్యప్రదేశ్‌లో చక్కెర ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేవలం 18 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర దాదాపు రూ.18 వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో భోపాల్ హోల్‌సేల్ మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.61కు చేరింది. ఇంత తక్కువ సమయంలో చక్కెర ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. చక్కెర ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ స్టాక్ విధానం కూడా ఓ కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చక్కెర నిల్వల పరిమితిని ఎక్కువగా ఉంచిందని, దీనివల్ల మార్కెట్లో సరఫరాపై ప్రభావం పడుతోందని అంటున్నారు. స్టాక్ పరిమితిని తగ్గిస్తే మార్కెట్లో చక్కెర లభ్యత పెరిగి ధరలను కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
చక్కెర ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తి పెరగడాన్ని వ్యాపారులు సూచిస్తున్నారు. చక్కెర తయారీకి వినియోగించే చెరకులో కొంత భాగాన్ని ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడంతో చక్కెర తయారీపై ప్రభావం పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మరోవైపు త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుండటంతో చక్కెరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదల కొనసాగితే స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల ధరలపై కూడా ఈ ప్రభావం పడొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చక్కెర మరింత ప్రియం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి పండుగల సమయంలో స్వీట్లు కొనుగోలు చేయడం సామాన్యుల జేబుకు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..