NTV Telugu Site icon

KCR : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది

Kcr

Kcr

KCR : అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని, అందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని, పార్టీ ఎమ్యెల్యేలకు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సోమవారం నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం పై అధినేత కేసీఆర్ చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ పై పార్టీ సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీ లో మండలిలో నిలదీయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలపై చర్చించిన కేసీఆర్, సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని వివరించారు. ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను అణచివేస్తున్నదని దుయ్యబట్టారు. లగచర్ల లో మెడికల్ ఫ్యాక్టరీ పేర తమ భూములు గుంజుకుంటున్నారని రొడ్లమీదికి వచ్చిన గిరిజనుల మీద ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నదని, ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నివాసాలను కూలగొడుతున్నదని, ఇది ఎంతమాత్రం క్షమించరానిదన్నారు. హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలన్నారు.

Bashar al-Assad: సిరియా అధ్యక్షుడు అస్సాద్ దేశం విడిచిపెట్టాడు: రష్యా..

ఇంకా పలు కీలక అంశాల పై అనుసరించాల్సిన వ్యూహాలను సభ్యులకు అధినేత వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ” రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చినాం. ఇంకా మనం మాట్లాడకుంటే మంచిదికాదు. ప్రజలు కూడా వూరుకోరు. లేనిపోని ఆశలు కల్పించి ప్రజలను నిలువునా మోసం చేసి ఇప్పుడు ప్రశ్నించినోల్లనే రాష్ట్ర ప్రభుత్వం పగబడుతున్నది. తనను నమ్మి వోట్లేసిన నిరుపేదలను రైతులను గిరిజనులను దళితులను నిర్థ్యాక్షిణ్యంగా వేధిస్తున్నది. ఇదేంది అని అడిగిన వాల్లను కేసులు పెట్టి వేధిస్తున్నది. ప్రజల పక్షాన పోరాడుతున్న బిఆర్ఎస్ నేతలను శ్రేణుల మీద వూ.. అంటే కేసులు పెట్టి భయ భ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నది. త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేయాలని చూస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకు విసుగు పుడుతోంది. అన్నవస్త్రాలకని పోతే వున్న వస్త్రాలు వూసిపోయినట్టయిందని ప్రజలు దు:ఖ పడుతున్నారు.’’ అని తెలిపారు.

దళితులను బీసీలను ఏ ఒక్కరినీ వదలకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతివొక్క వర్గాన్ని వంచిస్తున్నదన్నారు. కామారెడ్డి బిసీ డిక్లరేషన్ ఏమయిందాన్నారు. సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదునాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చినారన్నారు. వృథాగా సముద్రంలో కలుస్తున్నకాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోస్తలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యిందని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ‘‘ మన ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యంత ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులుగా చరిత్రకెక్కారు. పదేండ్ల కాలంలో వారి జీతాలను 73 శాతం పెంచినాం. కాగా…తమకు వోటేస్తే మిమ్మల్ని అందలమెక్కిస్తామని ఊదరగొట్టి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు కాంగ్రేస్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. వారికి అందాల్సిన 5 డీయేలకు గాను కేవలం వొక్క డీ.ఏ విదిలించింది. దాన్ని కూడా 17 వాయిదాలల్లో అందిస్తామని సిగ్గులేకుండా ప్రకటించింది. తెలంగాణ ఉద్యోగుల పరిస్తితిని దారుణంగా తయారయిందని విమర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వొక సామెతను ఉదహరించారు. ఎనకటికి ఇటువంటి ముఖ్యమంత్రే ఏమీ తెల్వని అమాయకున్ని తీర్థం పోదామని తీస్కపోయిండంట..తీస్కపోయినాయినేమో గుల్లె పండుకుండంట..ఆశపడి ఎమ్మటిపోయినోన్న సలిలో పండబెట్టిండంట’’ అని చెప్పారు. ‘‘తీర్తం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నీను సల్లె’’ అనే సామెతను చెప్పి..ఉద్యోగుల పరిస్తితి అట్లనే తయారయిందని తెలిపారు. దాంతో సమావేశంలో నవ్వులు విరిసాయి.
రాష్ట్రంలోని గురుకుల విద్య రోజు రోజుకూ దిగజారుతున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ గురుకుల విద్యాలయాలను మనం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను ప్రపంచ స్థాయి లో పోటీ పడి అత్యున్నత చదువులను చదివించాం. అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో వారికి అవకాశాలోచ్చినాయి. బిఆర్ఎస్ హయాంలో కార్పోరేట్ విద్యాలయాలకు మించి ఉన్నత విద్యనందించిన గురుకులాలు ప్రజలనుంచి గొప్పగా ఆదరణ పొందాయి. పోటీ పడి తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించారు. గురుకులాలకు పెరుగుతున్న డిమాండును చూసి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం వేల సంఖ్యలో పెంచింది. వాటిని కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. అత్యున్నత స్థాయి విద్యా వసతులను కల్పించడం వల్ల కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కూడా తల్లిదండ్రులు వారి పిల్లలను గురుకులాల్లోనే వుండనివ్వాలని కోరుకున్నారు. అక్కడయితేనే రక్షణవుంటుందని భావించారు. ఎండాకాలం సెలవుల్లో కూడా పిల్లలను ఇండ్లల్లకు తీసుకుపోకుండా గురుకులాల్లోనే వుంచి చదివించేవారు. అంతగా ప్రజాదరణ పొందిన గురుకులాలను నేటి కాంగ్రేస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తున్నది. మనం తీర్చిదిద్ది చేతుల్లో పెడితే కూడా సక్కగా నడపడం చేతకావట్లేదు. తినేతిండిని కూడా సరిగ్గా వండి పెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతున్నది. పిల్లలు చనిపోతున్న దారుణ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నయి. ఇందుక సభ్య సమాజం సిగ్గుపడుతున్నది.

నాటి మన ప్రభుత్వ హయాంలో గురులకులాల బాధ్యునిగా అత్యున్నత సేవలందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలుపుతున్నాను. వారితో పాటు మరో నలుగురు సభ్యులతో కమిటీ వేసినాం. గురుకులాల సమస్యలేమిటి..ఎందుకింతగా పిల్లలు, తలిదండ్రులు బాధ పడుతున్నారో తెలుసుకోవాలని స్టడీ చేసి రావాలని నీనే స్వయంగా వారిని ఆదేశించి తోలితే…వారిని ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడం శోచనీయం. ఎంతో కష్టపడి వారు ఒక నివేదకను తయారు చేసి ఇప్పుడే నాకు అందజేశారు. నివేదికలో దిగ్భ్రాంతికరమైన అంశాలున్నాయి. వాటిమీద బిఆర్ఎస్ పార్టీ పోరాట కార్యాచరణ తీసుకుంటుంది.’’ అని తెలిపారు. అద్భుతంగా తీర్చిదిద్ది, తయారు చేసి సిద్దంగా పెట్టిన గురుకులాలనే సక్రమంగా నడపలేని , పిల్లలకు చదువును అందించడం చేతగాని రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వం దేశాన్ని ఉద్దరిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నది..దీని మీద అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలె’’ అని సూచించారు.

ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహమార్పు పై కేసీఆర్ స్పందించారు..‘‘తెలంగాణ అస్థిత్వం ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి కేవలం రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతో ఇటువంటి పిచ్చిపనులకు పూనుకోవడం శోచనీయం.తెలంగాణ తల్లి భావన కేసీఆర్ ది కాదు..యావత్ తెలంగాణ సమాజానిది. దీని గురించి 70 ఏండ్ల కిందనే, దాశరథి రావెల్ల వెంకట్రామారావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించారు. ఈ సంగతి ఈ ప్రభుత్వానికి దాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి తెల్వదు..కేసీఆర్ పెట్టిండని కేసీఆర్ ఆనవాల్లు లేకుండా చేయాలని మూర్ఖపుతనంతో వ్యవహరిస్తున్నారు. అని కేసీఆర్‌ మండి పడ్డారు.

World Oldest Married Couple: 100 ఏళ్ల పెళ్లికొడుకు.. 102 ఏళ్ల పెళ్లి కూతురు.. పదేళ్ల నుంచి రిలేషన్షిప్‌లో

Show comments