NTV Telugu Site icon

KCR : రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ వ్యూహం ఇదే..

Kcr

Kcr

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19 లేదా 20న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి మూడు లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. మార్చి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం.

READ MORE: Sambhaji Maharaj: శంభాజీ మహరాజ్‌కి అబూ అబ్మీ నివాళి.. ఔరంగజేబును పొగిడిన కొన్ని రోజులకే..

కాగా..తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహం పై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ పై చర్చ లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలకు బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా చర్చలో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటన పై ప్రభుత్వ తప్పిదం ఉందంటూ ఎత్తి చూపాలన్నారు. కాళేశ్వరం రిపేర్ చేయక పోవడంతోనే పంటలు ఎండుతున్నాయి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రం లోని వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చి.. వాటిపై చర్చ కు గట్టిగా పట్టు పట్టాలని ఎమ్మెల్యే లకు కేసీఆర్ సూచించారు.

READ MORE: Bangladesh: పాక్‌తో కలిసి బంగ్లా ఆర్మీలో సైనిక కుట్ర.. కీలక సైనిక జనరల్‌పై నిఘా..