Site icon NTV Telugu

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. సీఎం రేవంత్ సంతాపం

Maganti Gopinath1

Maganti Gopinath1

పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. వారి మరణానికి చింతిస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు.

Also Read:Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం.. పూర్తి వివరాలు ఇవే

జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Also Read:Manipur: మణిపూర్‌లో మరోసారి హైటెన్షన్.. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హైద్రాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు…మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న కేటీఆర్.. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన కేటీఆర్ గోపినాథ్ ను కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు.

Also Read:Jogi Ramesh : వైసీపీ ఓటమికి అమరావతి ఒక కారణమే.. మాజీ మంత్రి జోగి రమేశ్ కామెంట్స్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read:Mohan Babu : బావ, దీనికి నువ్వు రావాలా? అని ప్రభాస్ అడిగాడు!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం అత్యంత బాధాకరమని హరీశ్ రావు అన్నారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని ప్రకటించారు.

Exit mobile version