Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. సీఎం రేవంత్ సంతాపం
- మాగంటి గోపీనాథ్ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
- మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. వారి మరణానికి చింతిస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు.
Also Read:Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం.. పూర్తి వివరాలు ఇవే
Also Read
జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Also Read:Manipur: మణిపూర్‌లో మరోసారి హైటెన్షన్.. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హైద్రాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు…మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న కేటీఆర్.. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన కేటీఆర్ గోపినాథ్ ను కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు.
Also Read:Jogi Ramesh : వైసీపీ ఓటమికి అమరావతి ఒక కారణమే.. మాజీ మంత్రి జోగి రమేశ్ కామెంట్స్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read:Mohan Babu : బావ, దీనికి నువ్వు రావాలా? అని ప్రభాస్ అడిగాడు!
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం అత్యంత బాధాకరమని హరీశ్ రావు అన్నారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని ప్రకటించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!