KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం.. తెలంగాణ సోయికి నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ అని మాజీ మంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడం ద్వారా మాత్రమే, ఐలమ్మకి నిజమైన నివాళి అర్పించినవాళ్ళమౌతామని తెలిపారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలను స్మరించుకుంటూ మాజీ సీఎం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాటి రాచరిక పాలనలో తెలంగాణ రైతాంగ న్యాయమైన హక్కుల కోసం ధిక్కార స్వరం వినిపించిన ధీరవనిత ఐలమ్మ అని, అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని కేసీఆర్ కొనియాడారు. నాటి భూస్వాములను ధైర్యంగా ఎదురించి ధిక్కారాన్ని చాటడమే కాకుండా, నాటి చట్టాల పరిధిలోని న్యాయస్థానాల్లో పోరాడి గెలిచి ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించిన ఆమె పోరాట పంథా నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రస్తుత అస్తవ్యస్త పాలనా రాజకీయ పరిస్థితుల్లో, ఐలమ్మ చూపించిన ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి, తెలంగాణ సోయి నేటి యువత తప్పక అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుత పంథాలో తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా ఐలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని గుర్తుచేశారు.
ఐలమ్మ గొప్పతనాన్ని, ఆమె పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు చాటేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని కేసీఆర్ తెలిపారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగానే పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలు, శిశు సంక్షేమం, రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక వినూత్న పథకాలను అమలు చేశామన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ, కుల వృత్తులకు జీవం పోసి సబ్బండ వర్గాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టామని, ఆ నమూనా సాధించిన ఫలితాలు నేడు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని చెప్పారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడం ద్వారా మాత్రమే ఐలమ్మకు మనం నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Also Read
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
తాజావార్తలు
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!