KCR Enquiry: తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నింపే పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. నేటి ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఓపెన్ కోర్ట్‌లో విచారించాలని కమీషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయనను మినహాయించి అందరిని అక్కడి నుండి బయటకు పంపించిన అనంతరం…