Site icon NTV Telugu

KCR: రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటు.. కేసీఆర్‌ సంచనల ఆరోపణలు..!

Kcr

Kcr

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు.

READ MORE: Amit Shah: యుద్ధ బాధితులకు అండగా ఉంటాం.. కాశ్మీర్‌ టూర్‌లో అమిత్ షా భరోసా

కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ (NDSA) ఇచ్చిన రిపోర్టును నిర్మాణ సంస్థ L&T తప్పు పట్టడంపై చర్చించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్ అండ్ టీ సంస్థ ప్రశ్నని కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ లేఖతో ఎన్‌బీఎస్‌ఏ నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పొర్తయ్యేవరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్ కోరనున్నట్లు నిర్ణయించారు.

READ MORE: Adilabad: ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుల అరెస్ట్..

కాగా.. కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల తెలిసింది. జూన్‌ 5న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈ నెల 21న జస్టిస్‌ ఘోష్‌ నోటీసు పంపారు. దానికి స్పందించి హాజరుకావాలా లేదా అన్నదానిపై కేసీఆర్‌ న్యాయ నిపుణులతోనూ, పార్టీ నాయకులతోనూ చర్చిస్తున్నారు. కమిషన్‌ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు ఇలా అనేక అంశాలను కమిషన్‌కు వివరించవచ్చని నాయకులు చేసిన సూచనతో ఏకీభవించిన కేసీఆర్‌ హాజరుకావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Exit mobile version