NTV Telugu Site icon

Kaviya Maran: మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు.. బాధలో ఉండొద్దు

Kaviya

Kaviya

ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో.. ఎస్ఆర్హెచ్ టీమ్ మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో.. తమ ప్లేయర్లకు జట్టు యజమాని కావ్యా మారన్ ధైర్యం నింపారు. ‘మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా కాలర్ ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఫైనల్లో ఓడటం బాధాకరం. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో రాణించారని చెప్పుకొచ్చింది.

Swati Maliwal Case: బిభవ్ కుమార్ కు కోర్టు షాక్..బెయిల్ పిటిషన్ తిరస్కరణ

‘గాయ్స్ మీరంతా మేం తల ఎత్తుకునే ప్రదర్శన చేశారు. ఈ విషయం చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రతీ ఒక్కరు మన గురించి మాట్లాడుకునేలా చేశారు. దురదృష్టవశాత్తు ఈ రోజు మనకు కలిసి రాలేదు. కానీ మీరు మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చారు. గతేడాది చివరి స్థానంలో నిలిచాం. అయినా అభిమానులంతా భారీ సంఖ్యలో మన మ్యాచ్‌లకు హాజరయ్యారంటే మీ అసాధారణ ప్రదర్శనే కారణం. ప్రతీ ఒక్కరు మన అద్భుత ప్రదర్శన గురించి మాట్లాడుకుంటున్నారు. కేకేఆర్ టైటిల్ గెలిచినా.. అందరూ మీ గురించే మాట్లాడుతున్నారు’ అని చెప్పింది.

Polling: 35 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..

‘ఆ రీతిలో మనం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాం. మరోసారి అందరికీ ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఇలా బాధగా ఉండకండి. మనం ఫైనల్స్ ఆడాం. ఇది ఇతర గేమ్స్‌లా మాములు మ్యాచ్ కాదు. లీగ్‌లోని ఇతర జట్లు కూడా ఈ మ్యాచ్‌ను చూశాయి. థ్యాంక్యూ త్వరలో మళ్లీ కలుస్తాను’ అని కావ్యా మారన్ చెప్పుకొచ్చింది. కాగా.. కావ్య మారన్ మాట్లాడిన వీడియోను ఎస్ఆర్హెచ్ విడుదల చేసింది. కాగా.. ఫైనల్లో కేకేఆర్ చేతిలో సన్ రైజర్స్ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.

Show comments