Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : కవిత అసంతృప్తి.. BRS పతనానికి నిదర్శనం

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy : బీఆర్‌ఎస్‌ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఆమె అసంతృప్తి అనేది గత కొంతకాలంగా బయటపడుతోందని, ఇది ఇక బహిరంగంగానే మారిపోయిందని పేర్కొన్నారు. కవిత ఇటీవల పార్టీకి రాసిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. BRS పార్టీలో తన పాత్రను పూర్తిగా విస్మరిస్తున్నారనే అభిప్రాయం ఆమెలో ఉందని, కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చినట్లే తనకూ ఇవ్వాలన్నది ఆమె ఆవేదన అని పేర్కొన్నారు.

Gaddar Awards 2024: గద్దర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!

ట్రబుల్‌షూటర్‌గా గుర్తింపు పొందిన కేసీఆర్‌ ఇప్పుడు తానే ట్రబుల్స్‌లో చిక్కుకున్నారని, పార్టీ క్యాడర్‌ సందిగ్ధంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వారి నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతుందని, కవిత మాట్లాడుతున్నది ఆమె స్వంత ఎజెండా ప్రకారం కానీ, అది బీఆర్‌ఎస్‌లో విభేదాలు పెరుగుతున్నందుకు సంకేతం అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌ పూర్తిగా పతనమవుతోందని, మచ్చలేని నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. “BRS నాలుగు స్తంభాలాటల మధ్య కూలిపోబోతోంది. పదవులు, ఆస్తుల కోసమే అంతర్గత పోరు నడుస్తోంది. కవిత కూడా పార్టీ నుండి బయటకు వెళ్లాలని చూస్తున్నారు,” అన్నారు. అలాగే, బీజేపీకి బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే అవసరం లేదని, బీజేపీ ఒంటరిగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Shrashti Verma: తెల్ల చీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ..!

Exit mobile version