Site icon NTV Telugu

MLC Kavitha : దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష ఉంది

Kavitha

Kavitha

MLC Kavitha : బీసీల హక్కుల కోసం ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన దీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె తీవ్రంగా ఎండగట్టారు. “ఇది ప్రజాస్వామ్య దేశమా?” అనే ప్రశ్నతో ఆమె వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి.

కవిత వివరించిన దయనీయ సంఘటనలో, శ్రీరామనవమి సందర్భంగా రాజస్థాన్‌ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారాం జుల్లి రామాలయాన్ని దర్శించుకెళ్తే, ఆలయం మైలపడిందని అభిప్రాయపడుతూ సంప్రోక్షణ చేపట్టిన దళిత వ్యతిరేక వర్గాల చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. “ఇలాంటి దౌర్భాగ్యమైన ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే, ప్రజాస్వామ్యం, సమానత్వం, సోదరభావం అన్నది కేవలం మాటలకే పరిమితమవుతోంది” అని ఆమె వ్యాఖ్యానించారు.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి దేశపు గౌరవనీయ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. “రాష్ట్రపతి గిరిజన మహిళ అయితే ఏమి? ఆమెను ఆహ్వానించకపోవడం బీజేపీ ప్రభుత్వం ఎస్టీ సామాజిక వర్గం పట్ల తీసుకున్న దారుణ వైఖరి” అని పేర్కొన్నారు.

బీసీలకు కూడా ఈ దేశంలో ఇప్పటికీ అనేక అవమానాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. “ధర్నాలు ఎందుకు చేస్తున్నాం?” అని కొంతమంది అడుగుతున్నారని, “బీసీ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నా ఆవేశం, ఆవేదన ఇవి. రాజకీయ అవసరం కాదు, ఇది హక్కుల పోరాటం,” అని స్పష్టం చేశారు. ఈబ్ల్యూఎస్ అమలుతో 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తేసిన నేపథ్యంలో, కోర్టులు రిజర్వేషన్‌ను అడ్డుకునే అవకాశమే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. “బీసీలకు అర్హతకు తగ్గ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇది సరైన సమయం” అని పేర్కొన్నారు.

YSRCP: వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం..! హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు..

Exit mobile version