KBC 16: 2000 ఏడాది నుండి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అభిమానులకు ఎంతగానో చేరువైంది. ప్రజలు వారి జ్ఞానం ఆధారంగా ఈ క్విజ్ షో నుండి లక్షల డబ్బును పొందారు. కొందరు ఈ షో నుండి కోటీశ్వరులుగా ఎదిగారు. అయితే గత 24 ఏళ్లలో ఎన్నడూ జరగనిది తాజా సీజన్ 16లో జరిగింది. ఈ క్విజ్ షో పోటీదారుడు అమితాబ్ బచ్చన్‌ను తన ప్రత్యేకమైన అభ్యర్థనతో ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే.. ఇతర పోటీదారులకు అవకాశం ఇవ్వడానికి కోల్‌కతా నుండి వచ్చిన డాక్టర్ నీరజ్ సక్సేనా తన ఆటను మధ్యలోనే విరమించుకున్నాడు. ఆట నుంచి తప్పుకుంటానని అమితాబ్‌ను అభ్యర్థించాడు. దాంతో కంటెస్టెంట్ చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.
Bomb Threat: ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు.. విమానంలో 189 మంది ప్రయాణికులు
కంటెస్టెంట్ నీరజ్ సక్సేనా JSI విశ్వవిద్యాలయం ఛాన్సలర్. అతని విజయాలు విన్న బిగ్ బి ఇంప్రెస్ అయ్యారు. తాను భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశాను. అబ్దుల్ కలాం తన బాస్‌గా ఉన్నారు. ఆయనతో కలిసి అనేక ప్రాజెక్టులలో కూడా పనిచేశారు. ఇక నీరజ్ సక్సేనా షోలో చాలా బాగా ఆడాడు. రూ. 6,40,000 మొత్తాన్ని గెలుచుకున్నాడు. కానీ, ఇంతలో అతను షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. షో నుండి నిష్క్రమించాలనే తన నిర్ణయం గురించి నీరజ్ బిగ్ బికి చెప్పాడు. గేమ్ షోకి వచ్చే ఇతర కంటెస్టెంట్స్‌కి ఒకసారి ఆడే అవకాశం వచ్చేలా నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.
Miyapur: మియాపూర్ లో సంచరించింది చిరుత కాదు.. అటవీ శాఖ ఏమన్నారంటే..
ఈ విషయంపై నీరజ్ సక్సేనా హోస్ట్ అమితాబ్ తో మాట్లాడుతూ.., సార్, నాకు ఒక అభ్యర్థన ఉంది. నేను షో నుండి వైదొలగాలనుకుంటున్నాను. మిగిలిన కంటెస్టెంట్స్‌కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ మనకంటే చిన్నవాళ్లే.. వారు ఏది సాధించినా సరిపోతుంది. కంటెస్టెంట్ నుండి ఈ మాటలు విన్న హోస్ట్ అమితాబ్ కాసేపు ఆశ్చర్యపోయాడు. దానికి బిగ్ బి సమాధానమిస్తూ.. ‘సార్, మేము ఇంతకు ముందు ఇలాంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. ఇది మీ గొప్పతనం. పెద్ద హృదయం, మేము ఈ రోజు మీ నుండి చాలా నేర్చుకున్నాము. 20 ఏళ్లకు పైగా జరుగుతున్న ఈ గేమ్ షోలో ఇదే తొలిసారి అని మా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. ఏ పోటీదారుడు తన తోటి ఆటగాళ్ల కోసం ఈ గేమ్‌ను విడిచిపెట్టలేదని కొనియాడారు.