NTV Telugu Site icon

Breaking News: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి.. కానిస్టేబుల్ వీరమరణం

Army

Army

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం నుంచి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. నేడు కూడా కొనసాగింది. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. దీంతో పాటు డీఎస్పీ, ఏఎస్‌ఐకి గాయాలయ్యాయి.

READ MORE: Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్‌గాంధీ మౌనం ఎందుకు..?

డీజీపీ సంతాపం..
హెడ్‌ కానిస్టేబుల్‌ హెచ్‌సీ బషీర్‌ మృతి పట్ల జమ్మూ కాశ్మీర్‌ డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ సంతాపం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వీర పోలీసు కుటుంబానికి మొత్తం పోలీసు బలగాలు అండగా నిలుస్తున్నాయని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు దళం హెచ్‌సి బషీర్‌ను తిరిగి తీసుకురాలేనప్పటికీ, కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, తన వర్గాన్ని, దేశ ప్రజలను రక్షించడానికి బషీర్ కృషిచేసినట్లు తెలిపారు. తన ఆయుధంతో స్వయంగా విదేశీ ఉగ్రవాదిని హతమార్చిన ధైర్యవంతుడు బషీర్ అని కొనియాడారు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.