NTV Telugu Site icon

Karun Nair: అప్పుడలా.. ఇప్పుడిలా.. మళ్లీ తనను తలుచుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్

Karun

Karun

క్రికెటర్ కరుణ్ నాయర్ అంటే చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కానీ టెస్ట్ ల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ అంటే గుర్తొస్తుంది. ఇప్పుడు అతని పేరును ఎందుకు గుర్తుచేస్తున్నారు అనుకుంటున్నారా. మళ్లీ తన పేరును క్రికెట్ అభిమానులు తలుచుకోక తప్పదు. ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కొన్ని రోజుల వరకు బాగానే అవకాశాలు వచ్చాయి.. ఐపీఎల్ లో కూడా ఆడాడు. కానీ మెరుగైన ప్రదర్శన చూపించకపోవడంతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో శతక్కొట్టాడు.

Jailer: ‘జైలర్’ పై కేసు పెట్టిన RCB.. గట్టి షాక్ ఇచ్చిన హైకోర్టు

కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో కరుణ్ నాయర్ చెలరేగాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నాయర్ కొనసాగుతుండగా.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 28) 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో తన జట్టు (మైసూర్‌ వారియర్స్‌) భారీ స్కోర్‌ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న నాయర్‌.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నాయర్‌ తో పాటు ఆర్‌ సమర్థ్‌ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశారు. దీంతో మొదటగా బ్యాటింగ్‌ చేసిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో ట్విస్ట్.. ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రిపై సీబీఐ కేసు

అనంతరం 249 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుల్భర్గా.. 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. చివరకు గుల్భర్గా పోరాడినప్పటికీ.. విజయం దక్కలేదు. ఇక గుల్భర్గా ఇన్నింగ్స్‌లో మాక్నిల్ హాడ్లి 61, హసన్‌ ఖలీద్‌, 54, చేతన్, 28 పరుగులు చేశారు. మైసూర్‌ బౌలర్లలో జగదీశ సుచిత్‌ 2, మోనిశ్‌ రెడ్డి 2, కుశాల్ వాధ్వాని 2, గౌతమ్‌ మిశ్రా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున సెహ్వాగ్‌ 2, కరుణ్‌ నాయర్‌ ఓసారి ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 2016లో కరుణ్‌ నాయర్‌ ఇంగ్లండ్‌పై చెన్నైలో ట్రిపుల్‌ సెంచరీని (303 నాటౌట్‌) సాధించి, భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో సెహ్వాగ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.