జార్ఖండ్ రాష్ట్ర కర్ణి సేన అధ్యక్షుడు వినయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తలలో బుల్లెట్ కనిపించింది. ఇక మృతదేహం పక్కన ఒక పిస్టల్ కనిపించింది. వినయ్ సింగ్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఖతీపురాలోని రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించారని జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్‌తో కొట్టివేసింది.