NTV Telugu Site icon

Ram Mandir: రాంలాలా విగ్రహాన్ని తయారు చేసే అరుణ్ యోగిరాజ్ ఎవరో తెలుసా..?

Ram Mandir

Ram Mandir

Ayodhya: రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేసే సమయం ఆసన్నమైంది. రామ మందిరం గర్భగుడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు. మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల విగ్రహాన్ని గర్భగుడిలో ఏర్పాటు చేయనున్నారు. జనవరి 5న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేస్తూ.. విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు శిల్పులు వేర్వేరు ప్రదేశాల్లో విగ్రహాలను రూపొందిస్తున్నారు. దేశంలోనే ప్రముఖ శిల్పి, మన గర్వించదగ్గ యోగిరాజ్ అరుణ్ తయారు చేసిన రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు.

Read Also: Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…

అరుణ్ యోగిరాజ్ వివరాలు..
1. అరుణ్ యోగిరాజ్ కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి
2. మైసూర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు
3. అరుణ్ ప్రముఖ శిల్పి యోగిరాజ్ కుమారుడు.
4. వీరి కుటుంబం గత ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తుంది.
5. అరుణ్30 అడుగుల ఎత్తైన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రూపొందించాడు.
6. ఈ నేతాజీ విగ్రహం అమర్ జవాన్ జ్యోతి దగ్గర ఉంటుంది.
7. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది
8. రామకృష్ణ పరమహంస విగ్రహాన్ని కూడా నిర్మించాడు.

Read Also: NTR: సీడెడ్ ఆయన అడ్డా… దేవర బిజినెస్ ని మూడు రోజుల్లో ఊదేస్తారు

మరోవైపు శ్రీ రామమందిర శంకుస్థాపనకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రతి ఇంటికి అక్షత ఆహ్వానపత్రికలు ఇచ్చే పని నేటి నుంచి ప్రారంభమైంది. విశ్వహిందు పరిషత్ దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. మహారాష్ట్రలో కూడా ఈ ప్రచారం “సబ్కే రామ్”తో ప్రారంభమైంది. ఈ ప్రచారం మరో 15 రోజుల పాటు కొనసాగనుంది. కొన్ని రోజుల క్రితం, రామ మందిరంలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక రోజున జనవరి 22 న దీపావళి సందర్భంగా తమ ఇళ్లలో ప్రత్యేక దీపాలను వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.