Hema : బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:World Championship 2024: చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ..
ఈ రేవ్ పార్టీలో అటు కన్నడ.. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. కొంతమంది మోడల్స్, కొందరు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ లను ఈ పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ వంటి డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 20మందికి పైగా యువతులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ.. ఆయన నిన్న హైదరాబాదులోనే ఉన్నట్లు సమాచారం. నటి హేమ కూడా భాగమైందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ మీడియాలో నటి హేమ పేరు మార్మోగిపోతుంది. దీంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేసింది. కానీ పోలీసులు హేమ అక్కడ ఉన్నట్లు బయటపెట్టారు.
Read Also:KTR: చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు..