యూత్ కు బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కొత్త బైకులు వస్తే వెంటనే వాటిని కోనేస్తారు.. అందులోనూ పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు ఫీచర్స్ మాములుగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి.. బజాజ్ పల్సర్ తయారీ సంస్థ అప్ డేటెడ్ పల్సర్ N250ని లాంచ్ చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ..
పల్సర్ N250 ఫీచర్స్..గతంలో చాలా బైకులను లాంచ్ చేసింది.. కానీ ఈ ఏడాదికి గానూ ఎన్ 250ని లాంచ్ చేసింది. ఇక త్వరలోనే పల్సర్ F250ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.. ఈ బైకు టర్న్- బై – టర్న్ నావిగేషన్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వచ్చింది. అలాగే 50లో USD ఫోర్ట్స్ ఉన్నాయి.. ఈ కొత్త బైకుకు 140 – సెక్షన్ వెనుక టైర్ ఉంది. ఇది రైడ్ ఎబిలిటీని పెంచుతుంది.. ఇంకా అనేక ఫీచర్స్ ఉన్నాయి..
ఇక ధర విషయానికొస్తే.. ఈ కొత్త బైకు మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ సమయంలో రెండు రంగులే ఇచ్చిన కూడా ఇప్పుడు మూడు రంగుల్లో వచ్చేశాయి.. ఎరుపు, నలుపు, తెలుపు లో బైక్స్ రిలీజ్ చేసింది బజాజ్. బ్లాక్ కలర్ బండికి మాత్రం యూఎస్ డీ ఫోర్క్స్ మీద.. బ్లాక్ కలర్ రానుంది, రెడ్, వైట్ కలర్ బండ్లకి యూఎస్ డీ ఫోర్క్స్ పై బంగారు రంగు ఫినిష్ ఇచ్చారు. ఈ కొత్త బైకు షోరూం ధర వచ్చేసి రూ.1,50,829 గా కంపెనీ నిర్ణయించారు..